స్మార్ట్‌ఫోన్ చూస్తూ లిఫ్టులోకి వెళ్లింది.. చివరికి కాలు నుజ్జు నుజ్జు? (video)

మంగళవారం, 9 జనవరి 2018 (15:16 IST)
స్మార్ట్‌ఫోన్ మోజుతో సెల్ఫీల పిచ్చి ముదిరింది. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సెల్ఫీలు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. అలాగే స్మార్ట్ ఫోన్ చేతిలో వుంటే లోకాన్నే మరిచిపోయే వారు చాలామంది వున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ అంటూ స్మార్ట్ ఫోన్‌లో ఏదో ఒకటి చాట్ చేసుకుంటూ గడిపేవారు పెచ్చరిల్లిపోతున్నారు.

ఛాటింగ్ చేస్తూ పక్కనుండే వ్యక్తులను కూడా పట్టించుకోని వారున్నారు. ఇలా స్మార్ట్ ఫోన్ చూస్తూ.. లిఫ్ట్‌లోకి వెళ్లిన ఓ మహిళ కాలు కోల్పోయింది. స్మార్ట్‌ఫోన్‌ను చూస్తూ న‌డుస్తోన్న ఓ యువ‌తి లిఫ్ట్ ప్ర‌మాదానికి గురైన‌ ఘ‌ట‌న చైనాలోని షాంఘైలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే, ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతి పని ముగించుకున్నాక ఇంటికి వెళ్లేందుకు లిఫ్ట్ వద్దకు వచ్చింది. అంతలోనే స్మార్ట్‌‌ఫోన్‌ చూసుకుంటూ.. అడుగులు ముందుకు వేసింది. మొబైల్‌ చూసుకుంటూనే లిఫ్ట్‌ లోపలకు అడుగులు వేసింది. అయితే అప్పటికే లిఫ్ట్‌ డోర్లు మూసుకుపోతున్నాయి. ఈ విషయాన్ని గమనించని యువతి అలాగే లోపలకి వెళ్లిపోయింది.
 
కానీ ఒక కాలు బయట ఉండగానే లిఫ్ట్‌ వేగంగా కదిలింది. లిఫ్ట్‌ వేగానికి ఆమె కాలు కోల్పోయింది. లిఫ్టును ఆపాలని చూసిన సహ ఉద్యోగుల ప్రయత్నం విఫలమైంది. చివరికి స్మార్ట్‌ఫోన్‌పై వున్న మోజుతో కాలును కోల్పోయింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితురాలి పట్ల నెటిజన్లు అయ్యోపాపం అంటున్నారు. కానీ స్మార్ట్ ఫోన్లు వచ్చాయి కదా.. లోకాన్ని మరిచిపోతే ఇలాంటి దుర్ఘటనలు తప్పవని మరికొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి. స్మార్ట్ ఫోన్ చూసేటప్పుడు అప్రమత్తంగా వుండండి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు