భారత మార్కెట్లోకి యాపిల్ ఐఫోన్ ఎస్ఈ2

సోమవారం, 11 మే 2020 (19:33 IST)
iPhone SE 2020
యాపిల్ ఐఫోన్ ఎస్ఈ2 భారత మార్కెట్లోకి వచ్చేస్తోంది. త్వరలోనే దీన్ని భారత మార్కెట్లోకి తేనున్నట్లు ఇన్‌గ్రామ్‌ మైక్రో సంస్థ వెల్లడించింది. ఇందులో ఏ13 బయోనిక్ చిప్‌ను అమర్చారు. దీనిలోని బ్యాటరీ సామర్థ్యం అసమానమైన పనితీరును కనబరుస్తుంది. 
 
ఎస్‌ఈ 2 నీటిలో పడినా.. దుమ్ము అంటుకున్నా పనిచేస్తుంది. సింగిల్ కెమెరాతో ఇందులోని పోట్రెయిట్ మోడ్ ఎన్నో రకాల అనుభూతులను అందించగలదు. దేశవ్యాప్తంగా 4,200పైగా రిటైల్‌ స్టోర్లలో ఈ ఫోన్‌ లభించనుంది.
 
కొనుగోలుదారుల ప్రయోజనార్థం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో కలిసి ఎస్‌ఈ 2ను రూ. 38,900కే అందుబాటులోకి తేనున్నట్టు ఇన్‌గ్రామ్‌ మైక్రో సంస్థ తెలిపింది. అలానే హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి రూ. 3,600 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను కూడా ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు