జియో భారత్ ఫోన్ స్మార్ట్ ఫీచర్ ఫోన్... ఇంటర్నెట్ యాక్సెస్‌తో పాటు, యూపీఐ చెల్లింపు, Jio ఎంటర్టైన్మెంట్ యాప్‌లు కూడా అందించబడతాయి. Jio 4G ఫీచర్ ఫోన్‌తో అపరిమిత కాల్స్, తక్కువ ధరలలో మొబైల్ డేటా పొందవచ్చు.
రిలయన్స్ రిటైల్ కాకుండా, జియో భారత్ ఫోన్లను లాంచ్ చేయడానికి ఇతర బ్రాండ్లు కూడా జియో భారత్ ప్లాట్ఫామ్లో చేరుతున్నాయి. Jio Bharat ఫోన్లలో మొదటి పది లక్షల యూనిట్ల బీటా పరీక్ష జూలై 7 నుండి ప్రారంభమవుతుంది
ఈ మొబైల్‌తో UPI చెల్లింపులు చేయవచ్చు. దీని కోసం మీరు Jio Pay యాప్‌ని ఉపయోగించాలి. ఈ జియో సినిమా యాప్‌తో మీరు టీవీ షోలు, సినిమాలను చూడవచ్చు. జియో భారత్ ఫోన్‌తో జియో సవన్ యాప్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఇది ఎనిమిది కోట్లకు పైగా పాటలను అందిస్తుంది. ఇవి కాకుండా ఎఫ్ఎమ్ రేడియో, టార్చ్‌లైట్ వంటి ఫీచర్లు కూడా ఈ ఫోనులో ఉన్నాయి.