ఉచిత డేటా పేరుతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తన ఫ్రైమ్ ఆఫర్ గడువును ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఈ గడువులోపు రూ.99 చెల్లించి ప్రైమ్ కస్టమర్లుగా మారొచ్చునని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ప్రైమ్ కస్టమర్లకు మరో ఊహించని ఆఫర్‌ను ప్రకటించింది. ఏప్రిల్ 15లోపు 303 రూపాయలు లేదా అంతకు మించిన ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే మూడు నెలల పాటు ఉచిత (కాంప్లిమెంటరీ) సర్వీసులను అందిస్తామని జియో వెల్లడించింది.
మరోవైపు.. జియో ప్రైమ్ సభ్యులకు ‘సమ్మర్ సర్‌ప్రైజ్’ను ఇవ్వాలని నిర్ణయించినట్టు రిలయన్స్ జియో అధినేత ముకేష్ అంబానీ పేర్కొన్నారు. అంతేకాకుండా తొలిసారిగా రీచార్జ్ చేసుకున్న వారికి మూడు నెలల పాటు ఉచిత సర్వీసులను ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. కాగా 303 రూపాయల రీచార్జ్‌తో రోజు 1జిబి డేటాను ఆర్‌జియో 28 రోజుల గడువుతో అందిస్తోంది. వాయిస్ కాల్స్ ఉచితమని తెలిపారు.