భారతదేశంలో టెలికాం రంగంలో రిలయన్స్ జియో తీసుకొచ్చిన విప్లవం అంతాఇంతా కాదు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ స్మార్ట్ సేవలు అందుతున్నాయంటే అది జియో పుణ్యమేనని చెప్పొచ్చు. అలాగే, త్వరలోనే దేశంలోని ప్రతి ఒక్కరికీ 4జీ ఫీచర్ ఫోన్ ఉచితంగా అందజేసి మరో విప్లవానికి జియో నాందిపలికింది.
ఇందులోభాగంగా వై-ఫై కనెక్టివిటీ ద్వారా 38,000 కళాశాలలను అనుసంధానించనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల మానవవనరుల శాఖకు ఎలాంటి వ్యయం లేకున్నా మిగతా టెలికాం ఆపరేటర్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ టెండర్‌పై పారదర్శకంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
దీనిపై హెచ్‌ఆర్డీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. వైఫై సేవలు ఉచితంగా అందిస్తామని రిలయన్స్ జియో చెప్తుండటంతో ప్రాజెక్టు దానికే వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. మిగిలిన కంపెనీలకు అవకాశం ఇవ్వకుండా జియోకే పట్టం కట్టడం సరికాదు కాబట్టి టెండర్ ప్రాసెస్‌ను అమలు చేస్తామన్నారు. అయితే, ఉచితంగా సర్వీసులు జియో ఇస్తుంది కాబట్టి టెంబర్ దానికే వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.