కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన ట్రూ కాలర్ ... ఇకపై డెస్క్ టాప్‌లోనూ కాలర్ ఐడీ సేవలు!!

వరుణ్

బుధవారం, 10 ఏప్రియల్ 2024 (17:28 IST)
గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను గుర్తించేందుకు ప్రతి ఒక్కరూ ట్రూ కాలర్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ యాప్ ఎంతో ఫేమస్‌గా ఉంది. ఇపుడు ఈ యాప్ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై డెస్క్ టాప్‌లోనూ ట్రూ కాలర్ యాప్‌ను యాక్టివేట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఫోనులో ట్రూ కాలర్ యాప్ ఓపెన్ చేసి, మెసేజెస్ ట్యాబ్ క్లిక్ చేసి మెనూలోకి వెళ్లాలి. మెసేజింగ్ ఫర్ వెబ్ పై క్లిక్ చేసి కంప్యూటర్ స్క్రీన్‌పై web.truecaller.com సైట్లో క్యూఆర్ కోడ్‌లో స్కాన్ చేస్తే మీ ట్రూ కాలర్ వెబ్ వెర్షన్ సిద్ధమవుతుంది. 
 
నిజానికి ఈ వెబ్ వెర్షన్‌ను ట్రూ కాలర్ ఎప్పటి నుంచో కొనసాగిస్తుంది. ఈ తరహాలోనే ట్రూ కాలర్ వెబ్ కూడా ఎంట్రీ ఇచ్చింది. తొలుత ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో తెస్తున్నారు. యూజర్లు తమ ఫోన్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేయడం ద్వారా కాల్ అలెర్ట్‌లను, ఎస్ఎంఎస్‌లను డెస్క్ టాప్‌లోనే స్క్రీన్‌పై చూడొచ్చు. మొబైల్ తరహాలోనే డెస్క్ టాప్‌ వెర్షన్ కూడా ఎన్‌క్రిప్షన్ విధానంలో పూర్తిగా సురక్షితం అని ట్రూ కాలర్ వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు