యూట్యూబ్‌లో ఇప్పటివరకు పాటలు వినాలంటే మొబైల్ స్కీన్ ఆన్‌లో వుండాల్సిందే. ఆఫ్ చేస్తే పాటలు ఆగిపోతాయి. ఇక అలాంటి ఇబ్బంది వుండదు. ఇందుకోసం "యూట్యూబ్ మ్యూజిక్" అనే యాప్‌ను యూట్యూబ్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ యాప్ ద్వారా మనకు కావాల్సిన పాటను వినొచ్చు. స్క్రీన్ ఆన్‌లో ఉంచకుండానే పాటలు వినే సౌలభ్యం ఇందులో ఉంది.