గూగుల్ మీట్, జూమ్ అక్కర్లేదు.. 32 మందితో ఒకేసారి వీడియో కాల్.. వాట్సాప్ అదుర్స్

శనివారం, 1 జులై 2023 (22:52 IST)
వాట్సాప్ నుంచి కొత్త అప్‌డేట్ వచ్చేసింది. ఈ కొత్త ఫీచర్‌తో వాట్సాప్ యూజర్లు పండగ చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్న దిగ్గజ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. తాజాగా కొత్త ఫీచర్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. 

వాట్సాప్ వినియోగదారులు ఇప్పుడు పీసీలో ఏకంగా గరిష్టంగా 32 మందితో ఒకేసారి వీడియో కాల్స్ చేసుకోవచ్చుననే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. 
 
32 మంది పార్టిసిపెంట్స్‌తో బీటాలో వీడియో కాల్స్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఇక మీదట గూగుల్ మీట్, జూమ్ లాంటి వాటి అవసరం లేకుండానే ఒకేసారి 32 మందితో వీడియో కాల్‌లో డెస్క్‌టాప్‌ ద్వారా మీటింగ్‌కు ఏర్పాటు చేసుకోవచ్చునని వాబీటా ఇన్ఫో ప్రకటించింది. 
 
ఈ సదుపాయం ప్రస్తుతానికి కొత్త వాట్సాప్ బీటా ఇన్‌స్టాల్ చేసే కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో దీనిని యూజర్లందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు అన్నీ పనులు పూర్తవుతాయని వాబీటా ఇన్ఫో వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు