చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి రెడ్‌మి నుంచి కొత్త ఎక్స్ సిరీస్ స్మార్ట్‌టీవీలను లాంఛ్ చేయనుంది. ప్రస్తుతం సంక్షోభ సమయంలో మూడు స్మార్ట్ టీవీలను చైనాలో జరగబోయే లాంచ్ ఈవెంట్‌లో తీసుకు రానుంది. రెడ్‌మి టీవీ ఎక్స్50, రెడ్‌మి ఎక్స్ 55, రెడ్‌మి ఎక్స్ 65 స్మార్ట్ టీవీలను కంపెనీ మే 26వ తేదీన లాంచ్ చేయనుంది. దీంతోపాటు రెడ్ మీ 10ఎక్స్ సిరీస్ స్మార్ట్ ఫోన్లను కూడా లాంచ్ చేయనుందని సమాచారం.