ఎదిగే పిల్లలకు ప్రోటీన్లు అందజేసే ఎగ్ సేమియా!

సోమవారం, 13 అక్టోబరు 2014 (19:16 IST)
ఎదిగే పిల్లలకు ప్రోటీన్లు అందజేసే ఎగ్ సేమియా ఎలా చేయాలో మీకు తెలుసా? అయితే చదవండి. కోడిగుడ్డు మంచి పౌష్టికాహారం. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కోడిగుడ్డు తీసుకోవడం ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పోషకాహరలేమికి చెక్ పెట్టాలంటే రోజుకో గుడ్డు తినాల్సిందేనని వారు సలహా ఇస్తున్నారు.
 
అలాంటి కోడిగుడ్డుతో తరచూ ఆమ్లెట్స్, గ్రేవీల్లా కాకుండా పిల్లలకు నచ్చే విధంగా ఇష్టపడి తినే విధంగా వెరైటీగా ఎగ్ సేమియా ట్రై చేయండి. 
 
కావలసిన పదార్థాలు: 
ఉడికించిన కోడిగుడ్లు: మూడు
సేమియా: రెండు కప్పులు 
ఉడికించని కోడిగుడ్డు : ఒకటి 
నూనె: వేయించడానికి సరిపడా
చాట్‌మసాలా: ఒక టీ స్పూన్ 
నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్ 
ఉప్పు: రుచికి తగినంత
మిరియాల పొడి: అర టీ స్పూన్ 
 
తయారీ విధానం :
ముందుగా ఒక పాత్రలో సేమియా, చాట్‌ మసాలా, నిమ్మరసం, ఉప్పు, మిరియాలపొడి, అందులో కోడిగుడ్డును పగలగొట్టి లోపలి సొన వేసి బాగా కలపాలి. తర్వాత ఉడికించిన గుడ్డును అందులో వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. 
 
బాణలి వేడయ్యాక నూనె పోసి.. కోడిగుడ్డు మిశ్రమంతో పాటు లైట్‌గా ఉడికించిన సేమియా కలిపి దోరగా వేయించాలి. అంతే ఎగ్ సేమియా రెడీ. దీనిని సాయంత్రం పూట, మార్నింగ్ టిఫిన్‌గానూ టేస్ట్ చేయొచ్చు.

వెబ్దునియా పై చదవండి