పిల్లల్లో క్యాల్షియం స్థాయి పెరగాలంటే?

గురువారం, 20 ఫిబ్రవరి 2014 (16:46 IST)
FILE
పిల్లల్లో క్యాల్షియం స్థాయి పెరగాలంటే? పాల ఉత్పత్తులను ఇస్తుండాలని న్యూట్రీషన్లు అంటున్నారు. అప్పుడే భవిష్యత్తులో రక్తపోటును నియంత్రించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. పిల్లల్లో క్యాల్షియం శాతం పెరగడం ద్వారా దంత సమస్యలు దూరమవుతాయి.

ఇంకా పెద్దల్లో రక్తపోటు సమస్య ఉన్నట్లైతే రోజూ క్యాల్షియం సమృద్ధిగా అందే కొవ్వు లేని వెన్న తీసిన పాలు, పాల ఉత్పత్తులు వంటివి తీసుకోవాలి. పెరుగు రోజూ తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రించవచ్చు.

ఇంకా పిల్లల్లోనూ, పెద్దల్లోనూ శరీరానికి కావాల్సిన పొటాషియం అందాలంటే అరటిపండ్లు, బత్తాయి, దోసకాయ, టమాటాలు, ఉప్పు లేకుండా వేయించిన వేరు శెనగ, బీన్స్, బంగాళాదుంపలు, మునగాకు, కొత్తిమీర వంటివి తీసుకోవాలి. వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి