మీ పాప ఏడుస్తూనే ఉందా? ఏడుపును కంట్రోల్ చేయాలంటే?

శుక్రవారం, 27 డిశెంబరు 2013 (17:58 IST)
FILE
తల్లి గర్భం నుంచి అప్పుడే జన్మించిన శిశువు ఏడవటం సహజం. తల్లి గర్భంలో ఉన్న వెచ్చదనానికి, బయటి పరిస్థితుల వాతావరణం అనుకూలించడం కాస్త శిశువుకు అలవాటు పడాల్సి వుంటుంది.

ఇంకా శిశువుకు ఆకలి వేసినా, నొప్పి కలిగినా, వెచ్చదనం, సౌకర్యం, భయం, విసుగు, కడుపునొప్పి, దాహం, న్యాపి మురికిపడటం మరియు రియాక్షన్స్ వంటివి జరిగినప్పుడు శిశువు ఏడుపు రూపంలో మీకు తెలియజేస్తుంది.

అయితే మీ శిశువు ఏడుపు నుండి ఉపశమనం కలిగించడానికి మరియు ఆపడానికి కొన్ని మార్గాలున్నాయి. మీరు సున్నితమైన చిట్కాలను ప్రయత్నించండి మీ బేబీ యొక్క ఏడుపును నివారించాలంటే..

సాఫ్ట్ మరియు రిథమిక్ మ్యూజిక్ బిడ్డ ఓదార్చుటకు మరియు ఏడుపును ఆపడానికి సహాయపడుతుంది. మీ శిశువు యొక్క ఏడుపును ఆపాలంటే ఊయలలో పడుకోబెట్టి, నిదానంగా అటు, ఇటుగా ఊపుతూ, ఆక చక్కటి పాట పాడుతూ ఊపడం వల్ల ఏడుపు ఆపడంతో పాటు, నిద్రపోతారు.

శిశువు ఎప్పుడు వెచ్చదనం కోరుకుంటుంది. వారికి గోరువెచ్చని నీటితో రోజుకు రెండుసార్లు, ఉదయం, సాయంత్రం స్నానం చేయించడం మంచిది. శిశువును ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, క్లీన్‌గా ఉంచడం వల్ల వారి విశ్రాంతి పొందుటకు చాలా సహయపడుతుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి