మహిళల్లో ఒత్తిడి... గర్భధారణకు సమయం... సంతానలేమి

మంగళవారం, 25 మార్చి 2014 (14:29 IST)
PTI
ఆధునిక మహిళ అనుభవించే ఒత్తిడి అంతాఇంతా కాదు. వర్కింగ్ ఉమెన్ అయితే మరీనూ. ఉదయాన్నే కార్యాలయానికి వెళ్లే సమయంలో అనుభవించే పని ఒత్తిడితోపాటు ఆఫీసుకు వెళ్లాక ఎదురయ్యే ఒత్తిడి అన్నీ కలిసి ఆమెను ఆరోగ్యపరమైన చిక్కుల్లోకి నెడుతున్నట్లు పలు పరిశోధనల్లో వెల్లడయింది. మహిళల్లో తీవ్రమైన ఒత్తిడి కారణంగా వివాహమయ్యాక వారు గర్భాన్ని ధరించేందుకు ఆలస్యమవుతుందనీ, ఇంకా కొందరిలో సంతానలేమి సమస్య కూడా ఎదురుకావచ్చని పరిశోధకులు చెపుతున్నారు.

లండన్ కు చెందిన ఓహియో స్టేట్ యూనివర్శిటీకి చెందిన డెన్నింగ్ లించ్ తమ బృందంతో చేసిన పరిశోధనల్లో ఈ విషయం తేలినట్లు వెల్లడించారు. మహిళల్లో తారాస్థాయికి చేరుకునే ఒత్తిడి కారణఁగా వారిలో ప్రెగ్నెన్సీకి సంబంధించిన సమస్యలు తలెత్తినట్లు స్పష్టంగా తెలిసిందన్నారు.

ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉన్న మహిళల కంటే ఒత్తిడితో ఉన్నవారు గర్భాన్ని ధరించే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇందుకుగాను ఒత్తిడిని అనుభవిస్తున్నవారు, ప్రశాంత జీవనాన్ని సాగిస్తున్నవారికి సంబంధించిన ప్రెగ్నెంట్ పరీక్షలను చేసినప్పుడు ఈ విషయం స్పష్టమైనట్లు చెప్పారు.

కాబట్టి ఒత్తిడి సమస్యను ఎదుర్కొంటున్నవారు యోగా, మెడిటేషన్ వంటి పద్ధతుల ద్వారా దానిని వదిలించుకోవాలని, తద్వారా ఇలాంటి సమస్యలను అధిగమించవచ్చని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి