వివాహమై సంవత్సరాలు గడిచినా పిల్లలు కలుగలేదా?

శనివారం, 19 ఏప్రియల్ 2014 (15:55 IST)
FILE
వివాహమై సంవత్సరాలు గడిచినా మీకు పిల్లలు కలగలేదా? ప్రస్తుత రోజుల్లో గర్భం ధరించడం అంటే అంత సులభం కాదు. ఎందుకంటే జీవనశైలిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జంక్ ఫుడ్, నిద్రలేమి, పార్టీలు, మద్యపానం వంటివే సంతానలేమికి కారణమవుతున్నాయని వైద్యులు అంటున్నారు.

అందుచేత స్త్రీ, పురుషులు తీసుకొనే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సలహా ఇస్తున్నారు. ఇంకా త్వరగా గర్భం పొందడానికి ఉపయోగపడే ఆహారాల్లో పుష్కలమైన పోషకాంశాలు ఉండేలా చూసుకోవాలి.

పుష్కలమైన విటమిన్స్ కలిగినటువంటి బెస్ట్ ఫుడ్ అయిన అరటి పండ్లను తీసుకోండి. ఇవి హార్మోనులను రెగ్యులేట్ చేస్తాయి. ఎగ్ స్పెర్మ్ డెవలప్మెంట్ కు బాగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అలాగే బాదంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మహిళల్లో ప్రత్యుత్పత్తికి అవసరం అయ్యే పోషకాంశాలు అందిస్తాయి. ఇంకా గర్భం పొందడానికి ప్రయత్నిస్తున్న మహిళలకు ఫుల్ ఫ్యాట్ డైరీ ఉత్పత్తులు బాగా సహాయపడుతాయి.

సంతానోత్పత్తిని పెంచడంలో బ్రొకోలీ గొప్పగా సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. ఇందులో ఫైటో స్టెరిలోస్ ఎక్కువగా హార్మోన్ సిస్టమ్‌కు సపోర్ట్ చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి