కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నారా... ఈ చిట్కాలు పాటించండి?

బుధవారం, 18 సెప్టెంబరు 2013 (12:56 IST)
File
FILE
కొత్తగా ఉద్యోగంలో చేరేవారు చిన్న చిన్న విషయాలకూ కంగారు పడిపోతుంటారు. అలాగే, కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. తొలిసారి విధులను ప్రారంభించేటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ, కంగారు పడిపోతే మాత్రం వ్యక్తిత్వ వికాసానికి దెబ్బతీయవచ్చు. ఇలాంటి వారి కోసం కొన్ని చిట్కాలు... ఉద్యోగంలో మొదటిసారిగా చేరేటప్పుడు సందేహాలను నివృతి చేసుకునేందుకు సంకోచించకండి.

ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ను తీసుకెళ్లడానికి మరిచిపోకండి. మీకు అప్పగించిన బాధ్యతలను మరిచిపోకుండా ఉండాలంటే వాటిని ఓ డైరీలో నోట్ చేసుకోండి. కొన్ని ఆఫీసుల్లో కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికోసం పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమంలో మీ కొలిగ్స్ అడిగే ప్రశ్నలకు సంకోచం లేకుండా ధీమాగా సమాధానం చేసేలా ఇంటి వద్దే ప్రిపేర్ అయి వెళ్లండి. ఆఫీసు ఖచ్చితమైన గంటకంటే పదినిమిషాల ముందే వెళ్లడం చేయండి.

ఆఫీసులో మీతో పనిచేసే వారిని ఆఫీస్ టైం తప్పనించి లంచ్, టీ టైంలలో గమనించండి. ఇతరులను విమర్శించే వారికి కాస్త దూరంగా ఉండండి. పనిలో బిజీ బిజీగా ఉన్నా చిరాకు అనిపించినా... ముఖంపై చిరునవ్వును చెదరనీయవద్దు. చాలా కంపెనీల్లో మొదటి రోజే ఎక్కువగా బాధ్యతలు అప్పగించరు. అందుచేత ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో అనుమానాలను అప్పుడప్పుడు నివృతి చేసుకోవడం ద్వారా ఇతరులను విసిగించే చర్యకు దూరంగా ఉండొచ్చు.

వెబ్దునియా పై చదవండి