2013 ప్రపంచ మహిళా దినోత్సవం : మహిళలపై హింస వద్దు.. యూఎన్ థీమ్

గురువారం, 7 మార్చి 2013 (17:09 IST)
FILE
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని మొట్టమొదటి సారి 1909 ఫిబ్రవరి 28వ తేదీన జరుపనున్నట్లు అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ ప్రకటించింది. ఈ తేదీ క్రమేణా మార్చి 8కి చేరింది. ప్రపంచ దేశాల్లో మహిళా దినోత్సవం సందర్భంగా సెలవు రోజు ప్రకటిస్తారు.

మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ఐక్యరాజ్య సమితి థీమ్‌ను ప్రకటిస్తుంది. ఈ క్రమంలో 2013కి ఐక్యరాజ్య సమితి థీమేంటో తెలుసా.. "2013 A Promise is a Promise: Time for Action to End Violence Against Women" ఇదే..

మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు బ్రేక్ వేయాలని, మహిళలపై యాసిడ్ దాడులు, లైంగిక దాడులు వంటి హింసాత్మక చర్యలకు బ్రేక్ వేయాలని ప్రతిజ్ఞ చేయాలంటూ ఐరాస పేర్కొంటుంది. మరి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

వెబ్దునియా పై చదవండి