అండమాన్ మహిళల నగ్న నృత్యం: పోలీసుల కేసు నమోదు

అండమాన్ మహిళల నగ్న నృత్యాలపై కేంద్రం సీరియస్ అయ్యింది. దీనిపై వివరణ ఇవ్వాలని అండమాన్ నికోబార్ దీవుల అధికారులను కేంద్రం ఆదేశించింది. పర్యాటకుల కోసం మహిళలతో అర్ధనగ్న డ్యాన్స్‌ చేయించి వీడియో తీసిన గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.

ఈ కేసుని ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం షెడ్యూల్ తెగలు మరియు ఆదిమ తెగల రక్షణ షెడ్యూల చట్టం కింద నమోదు చేయటం జరిగినదని పోలీసులు తెలిపారు. అండమాన్ మరియు నికోబార్ పోలీసులు, డిప్యూటీ సూపరింటిండెంట్‌ ఆఫ్ పోలీస్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు కేంద్ర ఏజెన్సీల సైబర్ సెల్ సహాయంతో ఎక్కడ కంప్యూటర్ నుండి ఈ వీడియో వచ్చిందో అన్నదానిపై ఆరాతీస్తున్నారు.

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 292 (అసభ్యంగా), ఐటి విభాగము సెక్షన్ 67 కిందా షెడ్యూల్ కులం చట్టం కింద (సమాచారాన్ని పబ్లిషింగ్), విభాగము 3 (2) ఎస్‌టి, ఎస్‌సి కింద కేసు నమోదుచేశారు. స్థానిక పోలీసులు పర్యాటకుల దగ్గర నుంచి లంచం తీసుకొన్ని వారి (పర్యాటకుల) వినోదం కోసం గిరిజన మహిళలతో అర్ధనగ్న డ్యాన్స్ చేయిస్తున్నారని ప్రముఖ బ్రిటిష్ వార్తాపత్రిక ఒక కథనం వెలువరించిన సంగతి తెలిసిందే.

కొన్ని దశాబ్ధాలుగా అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో జరవా గిరిజనతెగకు చెందిన వారు నివసిస్తున్నారు. ఏమైనప్పటికీ అండమాన్ అధికారులు ఈ వీడియో కొన్నిసంవత్సరాల క్రితం షూట్ చేయబడినది అని చెప్పారు.

ముఖ్య కార్యదర్శి శక్తి సిన్హా ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫుటేజ్ కనీసం నాలుగైదు సంవత్సరాలు చిత్రీకరించి ఉండవచ్చని అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి పి.చిదంబరం మాట్లాడుతూ అక్కడ అధికారులతో జనవరి 21వ తేది నుండి జరిగే పర్యటనలో ఈ వివాదంపై చర్చిస్తామని వివరించారు.

వెబ్దునియా పై చదవండి