తమిళనాడులో నూతన సంవత్సరం..నేడే

తమిళులకు నేటినుంచే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇదివరకు ప్రతి ఏటా సూర్యమానం ప్రకారం ఏప్రిల్ నెల మధ్యలో చైత్ర మాసం తొలిరోజున తమిళ సంవత్సరాది పండుగను ఘనంగా జరుపుకునేవారు. చంద్రమానకాలం పాటించే తెలుగువారి ఉగాది కాస్త అటుఇటుగా వస్తుంది.

కాని సూర్యమానం, చంద్రమానం లెక్కలు ఆర్యుల ప్రభావంవల్ల వచ్చిందని, ద్రవిడులైన తమిళులు వాటిని పాటించకూడదన్నది తమిళనాట పలువురి వాదన.

దీనికి బదులుగా రైతుల దినోత్సవమైన సంక్రాంతిని తమిళుల సంవత్సరాదిగా పాటించాలన్నది వీరి అభిప్రాయం. నిరుడు ఫిబ్రవరి మాసం తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి శాసనసభలో దీనిపై ప్రత్యేక చట్టం ప్రతిపాదించారు.

ఈ చట్టం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. దీంతో తమిళ నెల తై మాసం తొలిరోజున బుధవారం అంటే జనవరి 14న తమిళనాడులో ప్రజలందరూ నూతనసంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి