23 యేళ్లకే మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన యువతి..

గురువారం, 30 మార్చి 2023 (19:06 IST)
బళ్లారి నగర పాలిత మేయర్‌గా అతి పిన్నవయస్కురాలైన త్రివేణి బాధ్యతలు చేపట్టారు. ఈమె 18 యేళ్లకే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 21 యేళ్లకే కార్పొరేటర్‌గా ఎంపికయ్యారు. ఆ తర్వాత మరో రెండేళ్లకే నగర మేయర్‌గా నియమితులయ్యారు. దీంతో కర్నాటకలో అతి చిన్న వయసులోనే మేయర్ అయిన యువతిగా త్రివేణి దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. అలాగే, డిప్యూటీ మేయర్‌గా జానకి బాధ్యతలు చేపట్టారు. 
 
18 యేళ్లకే కాంగ్రెస్ తరపున రాజకీయాల్లోకి అడుగుపెట్టిన త్రివేణి సూరి ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. ఓటర్లలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిపి మొత్తం సభా బలం 44. మొత్తం 39 మంది ఓటర్లు ఉన్న సభలో ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఓట్లు సాధించి 28 ఓట్లు సాధించి త్రివేణి బీజేపీ అభ్యర్థి నాగరత్నమ్మ పై విజయం సాధించారు. 
 
దీంతో మేయర్ ఎన్నికల్లో విజయం సాధించి అతి పిన్న వయసులోనే బళ్లారికి మేయర్ అయిన ఘనత సాధించారు. బీజేపీకి 13 మంది కార్పొరేట్లు ఉండటంతో మేయర్ పదవి దక్కించుకోవటానికి పలు యత్నాలు చేసింది. కానీ స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న త్రివేణికే ఓట్లు వేయటంతో ఆమె మేయర్‌గా ఎన్నికయ్యారు. 23 ఏళ్ల త్రివేణి మేయర్‌గా గెలుపొంది సంచలనం సృష్టించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు