మొదట బాలికపై బస్సు డ్రైవరు గిరీష్ అత్యాచారం చేశాడు. బస్సు డ్రైవరు అందించిన సమాచారంతో అభి అనే మరో యువకుడు బాలికపై అత్యాచారం చేసి ఆమె అశ్లీల వీడియోలు, ఫొటోలు తీసుకున్నాడు. అనంతరం అభి స్నేహితులు అశ్లీల ఫొటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసి వారు కూడా అత్యాచారం చేశారు. బాధిత బాలిక తల్లి మరణించడంతో ఆమె అత్త ఇంట్లో నివాసముంటోంది.
బాలికపై అత్యాచారం జరిగిన ఘటన గురించి అత్తకు తెలిసినా పట్టించుకోలేదని, ఈ దారుణ ఘటనలో అత్త కూడా నిందితురాలేనని జిల్లా ఎస్పీ శ్రుతి చెప్పారు. ఈ ఘటనలో నిందితులైన అభి, గిరీష్, వికాస్, మణికంఠ, సంపత్, అశ్వత్ గౌడ, యోగీష్, ఎంజీఆర్ క్రషర్ యజమాని, బాధిత బాలిక అత్తలను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 201, 370, 376(3), 376(ఎన్), పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశామని పోలీసులు వివరించారు.