పేరుకే ప్రజా ప్రతినిధులు.. చట్టసభల్లో పోర్న్ వీడియోలు చూస్తూ కాలక్షేపం.. ఎక్కడ?

శనివారం, 30 జనవరి 2021 (09:30 IST)
porn
ప్రజా ప్రతినిధులు ప్రజల కోసం పనిచేయట్లేదు. చట్టసభల్లో కూర్చుని ప్రజలకు అవసరమైన పనులపై చర్చించాల్సిన నేతలు అశ్లీల వీడియోలు చూస్తున్నారు. చట్టసభలో కూర్చొని ప్రజలకు అవసరమైన పనులపై చర్చించాల్సిన నేతలు అశ్లీల వీడియోలు చూస్తున్నారు. అతి జుగుప్సాకరమైన ఘటన కర్ణాటక శాసన మండలిలో శుక్రవారం చోటు చేసుకుంది.
 
గతంలోనూ ముగ్గురు ఎమ్మెల్యేలు కర్ణాటక శాసనభలో పోర్న్‌ వీడియోలు చూస్తూ కెమెరాలకు చిక్కడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు గురువారం ప్రారంభం కాగా.. తొలిరోజు ప్రభుత్వం 11 బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టింది. వీటిపై రెండో రోజు శుక్రవారం అసెంబ్లీ, మండలిలో కీలక చర్చ ప్రారంభమైంది. అయితే బిల్లులపై చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ప్రకాశ్‌ రాథోడ్‌ పోర్న్‌ వీడియో చూస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు.
 
ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీన్ని మీడియా, సోషల్‌ మీడియా పోర్న్‌గేట్‌ 2.0గా అభివర్ణిస్తోంది. ఎమ్మెల్యే తీరుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే దీనిపై ఎమ్మెల్సీ రాథోడ్‌ స్పందించారు. తన మొబైల్‌ ఫోన్‌లో మెమొరీ నిండిపోగా.. అనవసరంగా స్టోరైన వీడియోలను డిలీట్‌ చేశానే తప్పా.. వీడియోలు చూడలేదని పేర్కొన్నారు. 
 
కౌన్సిల్‌లో నేను అడిగిన ప్రశ్నకు సంబంధించిన సమాచారం మంత్రికి అందించేందుకు ఫోన్‌ను తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఫోన్‌లో మెమొరీ నిండి ఉండడంతో అవసరం లేని వీడియోలు డిలీట్‌ చేశానని, దీనిపై రచ్చ అనవసరమన్నారు. సాధారణంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలోకి సెల్‌ఫోన్లను తీసుకెళ్లమంటూ వివరణ ఇచ్చారు. అయితే, ఈ ఘటనపై అధికార పార్టీ బీజేపీ సైతం ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు