90% పురుషులు.. ఇతరుల భార్యతో డేటింగ్.. తప్పులేదు: బీహార్ సీఎం

మంగళవారం, 17 ఫిబ్రవరి 2015 (18:48 IST)
బీహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మంఝీ సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తలకెక్కారు. బీహార్ రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపుకుదిపి.. జేడీయు పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన.. తాజాగా మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

సమాజంలో ఉన్న పురుషుల్లో  కేవలం ఐదు శాతం మంది మగాళ్లు మాత్రమే తమ భార్యలతో కలిసి బయటకు వెళుతున్నారన్న ఆయన, 90 శాతం మంది పురుషులంతా, ఇతరుల భార్యలతో డేటింగ్ చేస్తున్నవారేనని వ్యాఖ్యానించారు. తమ బీహార్ రాష్ట్ర పురుషులే ఈ పని చేస్తున్నారన్నారు. 
 
అయినా, పరస్పర అంగీకారం ఉంటే ఇలాంటి విషయాలు ఎంతమాత్రం తప్పుకాదని కూడా ఆయన ఓ న్యాయమూర్తిలా తీర్పు ఇచ్చారు. బ్లాక్ మార్కెటింగ్ విషయంలో పేదలకు తక్కువ శిక్ష సరిపోతుందన్న మాంఝీ, ధనవంతులకు మాత్రం భారీ శిక్షలు అమలు చేయాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి