జీవిత భాగస్వామితో ఇష్టం లేకుండా బలవంతపు శృంగారం, అసహజ శృంగారం చేస్తే విడాకులకు ప్రాతిపదికేనని పంజాబ్, హరియాణా హైకోర్టు స్పష్టం చేసింది. తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని ఒక మహిళ చేసిన విజ్ఞప్తిపై మన్నించింది. తన భర్త అతని కోర్కె తీర్చుకోవడం కోసం తనను తరచూ హింసించేవాడని, అసహజ లైంగిక చర్యలకు పాల్పడేవాడని ఆమె ఆరోపించింది.
ఆమె విజ్ఞప్తిని దిగువ న్యాయస్థానం తోసిపుచ్చగా హైకోర్టును ఆశ్రయించింది. అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడినట్లు రుజువు చేయలేకపోయారన్న దిగువ న్యాయస్థానం అభిప్రాయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. బలవంతపు శృంగారం, అసహజ శృంగారం చేస్తే విడాకులకు ప్రాతిపదికేనని ఈ కేసులో హైకోర్టు తీర్పు ఇచ్చింది.