భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోతోంది. అనుమానాలు పెరిగిపోతున్నాయి. అంతేగాకుండా వివాహేతర సంబంధాలు నేరాలకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో వేరొక వ్యక్తితో బైకులో షికార్లు చేస్తూ కనిపించిన భార్యను భర్త లారీతో ఢీ కొట్టి హతమార్చిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లాలోని గరివిడి మండలం కాపుశంభాం గ్రామానికి చెందిన రమణమ్మ-తవిటయ్య దంపతులు.
తవిటయ్య లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీలో భాగంగా నిత్యం లారీపైనే ఉండే తవిటయ్యకు భార్యపై అనుమానం పెరిగింది. ఈ క్రమంలో భార్యకు ఫోన్ చేసి సుభద్రాపురం జంక్షన్‌కు వస్తే డబ్బులిస్తానని చెప్పాడు. భర్తను కలిసేందుకు రమణమ్మ, మరిది వరసైన రామకృష్ణతో కలసి బైక్‌పై సుభద్రాపురం బయలుదేరింది.