ఇక తన మొదటి భార్యకు పుట్టిన ఇద్దర అమ్మాయిలను కూడా రెండో భార్యతో పాటే వుండమన్నాడు. వారలానే వుంటున్నారు. ఈ క్రమంలో తన పెద్ద కుమార్తెపై కన్నేసి కామాంధుడిగా మారిపోయాడు. ఆమెకి అన్నంలో మత్తు మందు కలిపి ఇవ్వడం మొదలుపెట్టాడు. భోజనం చేయగానే పెద్ద కుమార్తె మత్తులోకి జారుకోగానే ఆమెపై అత్యాచారం చేసేవాడు. ఇలా గత కొన్నిరోజులుగా జరుగుతోంది.
తెల్లారిన తర్వాత ఆ బాలిక తన శరీరంలో ఏవో మార్పులు వస్తున్నట్లు అనిపిస్తోంది కానీ వాటికి కారణం ఏమిటో అర్థంకాలేదు. దాంతో ఓ రోజు తండ్రి ఇస్తున్న అన్నాన్ని తింటున్నట్లు నటించి వెళ్లి తన బెడ్రూంలో పడుకుంది. కుమార్తె ఎప్పటిలాగే మత్తులోకి జారుకుందని భావించిన కామాంధుడు ఆమెపై అత్యాచారం చేయబోయాడు. వెంటనే ఆమె పెద్దగా కేకలు వేసింది. దాంతో విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. ఆ బాలిక తన స్నేహితురాలి సాయంతో స్వచ్చంద సంస్థ దృష్టికి తీసుకెళ్లింది. విషయం పోలీసులకు చేరవేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.