ఏ తల్లి చేయని పని ఆ తల్లి చేసింది. కొడుకు పెడమార్గాన వెళుతుంటే అతనికి మంచి బుద్థులు నేర్పించాల్సింది పోయి అతనికి సహకరించింది. చివరకు కటాకటాల పాలైంది. తమిళనాడు రాష్ట్రం మధురైలోని సక్కిమంగళం నావాస్త్రా ప్రాంతంలో మహాలింగం, భాగవతి దంపతులు నివాసమున్నారు. వీరికి సెంథిల్ అనే 18 యేళ్ళ కుమారుడు ఉన్నాడు. మహాలింగం మార్కెటింగ్ పని మీద నెలకు 15 రోజులు బయటి ప్రాంతంలో తిరుగుతుండేవాడు.