యూఎస్ వీడియో కాల్ భర్త నాకొద్దు, అందుకే డ్రైవరుతో వెళ్లిపోతున్నానంటూ భార్య

గురువారం, 17 డిశెంబరు 2020 (21:07 IST)
పెళ్ళయ్యింది. ఇద్దరు పిల్లలున్నారు. అయితే భర్త మాత్రం విదేశాల్లో ఉంటున్నాడు. ఒంటరి జీవితం. డ్యాన్స్ టీచర్. విరహం తట్టుకోలేకపోయింది. కావాల్సినంత ఆస్తి ఉన్నా కోరికలను మాత్రం అదుపు చేసుకోలేకపోయింది. కారు డ్రైవర్‌తో కమిట్ అయ్యింది. చివరకు జీవితాన్ని నాశనం చేసేసుకుంది. 
 
తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా తిరుపట్టార్ ప్రాంతానికి చెందిన సంగీత, శరవణలకు ఐదేళ్ళ క్రితమే వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. శరవణ యుఎస్‌కు ఒకటిన్నర సంవత్సరం క్రితం వెళ్ళాడు. భార్యను వారి తల్లిదండ్రుల వద్ద కాకుండా వేరు కాపురం పెట్టి అక్కడే ఉంచాడు.
 
విదేశాల్లో బాగా డబ్బులు సంపాదించి పంపించేవాడు. అయితే భర్త పంపించే డబ్బుల కన్నా సంగీతకు ఆమె కోర్కె తీర్చే వ్యక్తి లేకపోవడంతో వెలితిగా అనిపించింది. వీడియో కాల్‌లో మాట్లాడే భర్తతో విసిగిపోయింది. ఇంట్లో కారుతో పాటు డ్రైవర్, సకల సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. కానీ సంసార సుఖం లేకపోవడంతో డ్రైవరుతో కమిట్ అయ్యింది. అతడిని ముగ్గులో దింపింది సంగీత. గత రెండు నెలల నుంచి అతనితోనే గడుపుతోంది. ఇంట్లోనే ఇద్దరూ శృంగారంలో మునిగితేలారు.
 
అయితే వారం రోజుల క్రితం పిల్లలను ఇంట్లో వదిలి పారిపోయింది సంగీత. విషయం కాస్త భర్తకు తెలిసింది. తన భార్య డ్రైవరుతో వెళ్లిపోయిన సంగతిని పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అయితే ఫోన్లో మాట్లాడిన సంగీత తను ఇక రానని.. డ్రైవర్ తోనే ఉంటానని తేల్చి చెప్పింది. పోలీసులు సంగీత ఎక్కడుందో వెతికే పనిలో పడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు