కాగా, అన్నాడీఎంకే పార్టీ అధికారిక రెండాకుల గుర్తు దక్కేందుకు ఈసీకి లంచం ఇచ్చేందుకు సిద్ధమై.. ఇందుకోసం రూ.60 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. ఇందులో రూ.10 కోట్లను ముందు ఇచ్చేందుకు ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని హవాలో బ్రోకర్ల ద్వారా చెల్లించేందుకు దినకరన్ ప్రయత్నాలు మొదలెట్టారు.
ఈ కేసులో మొదట దినకరన్ మధ్యవర్తి సుఖేష్ చంద్రశేఖరన్‌ను ఆ తర్వాత దినకరన్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం దినకరన్ ఐదు రోజుల విచారణకు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ విచారణలో భాగంగా, ఢిల్లీ నుంచి దినకరన్‌ను చెన్నై తీసుకెళ్లిన ఢిల్లీ పోలీసులు దినకరన్ భార్యను ప్రశ్నించారు.
అనంతరం సుఖేష్ చంద్రశేఖరన్‌కు 10 కోట్ల రూపాయలు అందజేసిన హవాలా ఏజెంట్ నరేష్‌ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థాయ్‌లాండ్ పర్యటన ముగించుకుని వచ్చిన నరేష్‌ను డిల్లీ పోలీసులు, ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.