అక్రమ సంబంధం నేరం కాదంటూ గత 2018లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై మంగళవారం స్పష్టత నిచ్చింది. ఐపీసీలోని సెక్షన్ 497ను కొట్టివేస్తూ 2018లో జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు సాయుధ దళాల చట్టంలోని నిబంధనలకు సంబంధం లేదని అందువల్ల వివాహేతర సంబంధం పెట్టుకున్న సైనిక అధికారులపై చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.