'అగ్నిపథ్' కింద ఇండియన ఆర్మీలో ఉద్యోగాలు... తెలుగు రాష్ట్రాల యువతకు ఛాన్స్

శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (11:11 IST)
అగ్నిపథ్ పథకం కింద 2023-24 సంవత్సరానికిగాను పలు పోస్టుల భర్తీకి రక్షణ శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. భారత సైన్యానికి చెందిన చెన్నైలోని దక్షిణ రిక్రూట్మెంట్ జోన్ ఆఫీసులో సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు చెందిన యువత దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
ఈ రిక్రూట్మెంట్‌లో ఎలాంటి పోస్టులు భర్తీ చేయనున్నారనే విషయాన్ని పరిశీలిస్తే, నోటిఫికేషన్‌లో భాగంగా సోల్జర్ టెక్నికల్ నర్సింగ్, అసిస్టెంట్ / నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. 
 
అభ్యర్థుల వయసు పదిహేడున్నర సంవత్సరాల నుంచి 23 యేళ్ల మధ్య ఉండాలి. అక్టోబరు ఒకటో తేదీ 2000 నుంచి అక్టోబరు ఒకటో తేదీ 2006 మధ్య జన్మించిన యువత మాత్రమే అర్హులు. అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్ సైన్స్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బోటనీ, జువాలజీ, ఇంగ్లీష్)లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 
 
ప్రతి సబ్జెక్టులో 40 శాతం మార్కులు సాధించివుండాలి. శారీరక కొలతల విషయానికి వస్తే ఎత్తు 165 సెంటీమీటర్లు, ఛాతి గాలి పీల్చినపుడు 5 సెంటీమీటర్లు విస్తరించేలా ఉండాలి. ఈ నెల 16వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రారంభంకాగా, చివరి తేదీని మార్చి 15వ తేదీని నిర్ణయించారు. పరీక్షను ఏప్రిల్ 17వ తేదీన నిర్వహించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు