ఐటీ సిటీగా పేరున్న బెంగళూరు ప్రస్తుతం కీచకపర్వాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతోంది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా యువతులపై పోకిరీ ఆగడాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు పెచ్చరిల్లిపోతున్నాయి. కొత్త ఏడాది ఆరంభాన గార్డెన్ సిటీలో జరిగిన సామూహిక లైంగిక వేధింపులు యావత్ భారతాన్ని కలవరపరిచిన సంగతి తెలిసిందే.
తాజాగా మరో దారుణం బెంగళూరులో చోటుచేసుకుంది. పరిచయమున్న ఓయువతిని పబ్‌కు పిలిచి బాగా తాగించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు ఇద్దరు యువకులు. వివరాల్లోకి వెళితే.. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ యువతి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. రికీ, యెమెన్‌కు చెందిన ఆయూబ్ అనే ఇద్దరు యువకులు ఆ అమ్మాయిపై లైంగిక వేధింపులకు దిగి ఇంటికి తీసుకెళ్తామని చెప్పి రోడ్డుపైనే వదిలివెళ్లిపోయారు.