ఐటీ రాజధాని బెంగళూరులో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా జరిగిన కీచక పర్వానికి సంబంధించిన పోలీసులు 4 నుంచి 12 మందిని అరెస్టు చేశారు. నిందితులను బానసవాడి పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. కొత్త ఏడాది వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్ 31వ తేదీన పలువురు యువతులతో ఓ గ్యాంగ్ అసభ్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.