బోరు బావి దాదాపు 80 అడుగుల లోతులో ఉండగా.. పిల్లవాడు 50 నుంచి 60 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. పిల్లవాడు పడి దాదాపు 13 గంటలు కావస్తుంది. పిల్లవాడిని రక్షించేందుకు ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు పని చేస్తున్నాయి.
సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయకచర్యలు ముమ్మరం చేశారు. ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలంలో చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. సొరంగం తవ్వేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.