కనిపించని కరోనా.. ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసిన మధ్యప్రదేశ్!

గురువారం, 18 నవంబరు 2021 (07:31 IST)
దేశంలో కరోనా వైరస్ క్రమంగా మాయమైపోతోంది. ఒక్కో రాష్ట్రంలో ఈ వైరస్ పూర్తిగా క్రమేణా అదుపులోకి వస్తుంది. ఇపుడు కరోనా వైరస్ లేని తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ అవతరించింది. దీంతో ఆ రాష్ట్రంలో అన్ని రకాల కరోనా ఆంక్షలను ఆ ప్రభుత్వం ఎత్తివేసింది. 
 
కరోనా సంబంధిత అన్నిరకాల ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తున్నామని, ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు సామాజిక, రాజకీయ, క్రీడా, వినోదం, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలను ఎప్పటిలాగే నిర్వహించుకోవచ్చని చెప్పారు.
 
అయితే ప్రభుత్వ ఉద్యోగులు, దుకాణదారులు, పనిచేసేవారు, సినిమా థియేటర్ల ఉద్యోగులు తప్పనిసరిగా రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవాలని స్పష్టం చేశారు. ఇక సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు కనీసం ఒక్క డోసైనా తీసుకొని ఉండాలన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు