ఒకపుడు భార్యను భర్త చావబాదేవాడు. భర్త కొట్టే దెబ్బలను తాళలేక భార్య లబోదిబోమని ఏడుస్తూ ఇరుగుపొరుగు ఇళ్లలోకి తలదాచుకునేది. కానీ ఇపుడు ట్రెండ్ మారింది. భార్య చేతిలో భర్తలు తన్నులు తింటున్నారు. భార్యలే భర్తలను ఉతికి ఆరేస్తోంది. దానికి పెద్దగా కారణం కూడా అవసరం లేదు. ఒక మాట ఎదురు మాట్లాడితే చాలు. ఇదిగో ఇతని భుజం విరిగినట్లు విరగాల్సిందే. గుజరాత్ రాష్ట్రంలోని అమ్మదాబాద్‌లోని వాస్నాలో జరిగిన ఈ వింత సంఘటన వివరాలను పరిశీలిస్తే,
హర్షద్ అనే భర్త చక్కెరవ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యుల సలహా మేరకు కొన్ని వంటకాలు తినకుండా దూరంగా ఉంచసాగాడు. ఈ క్రమంలో బంగాళా దుంపల కర్రీ తినకూడదు. కానీ ఆ రోజు అతని భార్య మాత్రం చపాతీల్లోకి ఆలూ కర్రీ చేసింది. 'ఇది ఎందుకు చేశావు. నేను తినకూడదు అని తెలుసు కదా. తెలిసి కూడా కావాలనే చేశావు కదా' అని అన్నాడు. అంతే..
ఇక చూడు బయటకు వెళ్లి బట్టలు ఉతికే కర్రను తీసుకొచ్చి భర్తను ఫట్‌ఫట్‌మని వాయించేసింది. ఆ దెబ్బకి అతని అరుపులు ఇంటి చుట్టుపక్కలకు వినిపించాయి. వారు వచ్చి కాపాడేంత వరకు అతను దెబ్బలు తింటూనే ఉన్నాడు. తర్వాత అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ జరిపిన వైద్య పరీక్షల్లో భుజం ఎముక విరిగిందట.