ఆరు నెలల గర్భిణిపై అత్యాచారం.. భర్త లేని సమయంలో ఇంటికొచ్చి..?

సోమవారం, 8 జూన్ 2020 (17:52 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా.. వావి వరుసలు లేకుండా కామాంధుల ఆగడాలు ఆగట్లేదు. తాజాగా ఆరు నెలల గర్భిణిపై కామాంధుడు దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఈ అమానుష ఘటన గుజరాత్‌లో వెలుగుచూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్ పరిధిలోని నారోల్‌, పిప్లాజ్ ఏరియాలో నివాసం ఉంటున్న దంపతుల ఇంటికి అదే ప్రాంతానికి చెందిన భరత్ పార్మర్ వచ్చాడు. ఆ సమయంలో భర్త ఇంట్లో లేకపోవడంతో బయటికెళ్లాడని భార్య(22) చెప్పింది.
 
బట్టలు కొనడానికి లాల్‌దర్వాజ ప్రాంతానికి వెళ్లాడని చెప్పింది. ఆయన తిరిగొచ్చే వరకూ వేచి ఉంటానని చెప్పి భరత్ పార్మర్ ఇంట్లోనే కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఉన్నట్టుండి ఆమెను లాక్కెళ్లి బెడ్‌పై పడేశాడు. 
 
ఆరు నెలల గర్భంతో ఉందన్న కనికరం కూడా లేకుండా దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితురాలి భర్త పోలీసులను ఆశ్రయించాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు