మాయావతి తీరు... బైక్ వెంట పరుగెత్తే కుక్కలా ఉంది : బీజేపీ నేత

సోమవారం, 5 సెప్టెంబరు 2016 (16:56 IST)
బీఎస్పీ అధినేత్రి మాయావతిపై భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు దయా శంకర్ సింగ్ మరోమారు రెచ్చిపోయారు. ఆమెను కుక్కతో పోల్చారు. నిజానికి దయా శంకర్ సింగ్ పార్టీ నుంచి ఇప్పటికే బహిష్కరణకు గురైవున్న విషయం తెల్సిందే. గతంలో మాయావతిని వ్యభిచారిణితో పోల్చగా, ఇపుడు కుక్కతో పోల్చారు. 
 
బైక్ వెంట పరుగెత్తే కుక్క.. బైక్ ఆగగానే పారిపోతుందన్న చందంగా మాయావతి తీరు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే మునుపటిలా కాకుండా ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే ఆయన మాట మార్చేశారు. తాను మాయావతిపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి