పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాటలు విని తనను సీఎం పీఠ నుంచి తొలగించడాన్ని మాజీ ముఖ్యమంత్రి అమరీదర్ సింగ్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులోభాగంగా, ఆయన బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డాతో సమావేశమయ్యేందుకు హస్తిన బాట పట్టినట్టు సమాచారం.
ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూకు, అమరీందర్ సింగ్‌కు అసలు పొసగడం లేదు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఈ విబేధాలు కొనసాగుతున్నాయి. అయితే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ అధిష్టానం మధ్యే మార్గంగా అమరీందర్‌సింగ్‌ను దింపేసి దళిత వర్గానికి చెందిన చన్నీని ముఖ్యమంత్రిగా నియమించింది. దీంతో అమరీందర్ సింగ్ పార్టీకి దూరంగా ఉంటున్నారు.