గుజరాత్లో ఘోరం జరిగింది. ఓ వివాహవేడుకలో డాన్స్ చేస్తున్న వరుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆపై తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. వివరాల్లోకి వెళ్తే... గుజరాత్ లోని రనోలికి చెందిన సాగర్ సోలంకి (23) కి సమీప గ్రామంలోని యువతితో వివాహం జరిగింది. వివాహానంతరం స్నేహితులు, బంధువులతో బరాత్‌లో సాగర్ సోలంకి పాల్గొన్నాడు.
పెళ్లైన సంతోషంలో విపరీతంగా డ్యాన్స్ చేశాడు. స్నేహితుడి భుజాలపై కూర్చుని ఉత్సాహంగా డాన్స్ చేస్తూ తలవాల్చేశాడు. దీంతో భుజాలపైనుంచి అతని స్నేహితుడు కిందికి దించి సపర్యలు చేయగా, ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు.