పటేల్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో తమ మద్దతు కావాలంటే తమ డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని స్పష్టంచేశారు. అలాగే, తమ వర్గానికి కావాల్సిన రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. గుజరాత్ ఎన్నికల్లో అధికార గుజరాత్ పార్టీ చిత్తుగా ఓడిపోనుందని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ మాత్రమేనని చెబుతూ, ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలుపు అంత సులభమేమే కాదన్నాడు. కాంగ్రెస్‌కు తాను మద్దతు పలకాలంటే కొన్ని డిమాండ్లను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఉద్యోగ, విద్యా సంస్థల్లో పటీదార్లకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్ వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న అన్ని ప్రాంతాల్లో తాను సూచించిన వారికి టికెట్లు ఇవ్వాలని కోరినట్టు సమాచారం.
కాగా, బీజేపీ మాత్రం జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. కాంగ్రెస్, హార్దిక్‌లు ఇప్పటికే కలిసిపోయారని, ఇప్పుడు జరుగుతున్నది అంతా డ్రామాయేనని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.