వైకాపా తీర్థం పుచ్చుకోనున్న జయప్రద.. రోజాకు తోడైతే.. జగన్‌కు క్రేజ్..?

మంగళవారం, 24 అక్టోబరు 2017 (12:17 IST)
అలనాటి సినీ తార, మహిళా అధ్యక్షురాలు జయప్రద మళ్లీ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా జయప్రద త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేనలో జయప్రద చేరుతారని ప్రచారం సాగినా.. సరైన పార్టీ నిర్మాణమే లేని జనసేనలో చేరితో ఇబ్బందులొస్తాయని గ్రహించిన జయప్రద వైకాపాలో చేరేందుకు సంసిద్ధంగా వున్నట్లు వార్తలు వస్తున్నారు. 
 
ఒకప్పుడు టిడిపి తరపున రాజ్యసభ సభ్యురాలిగా జయప్రద పనిచేసారు. అయితే చంద్రబాబునాయుడు దెబ్బకు టిడిపినే కాదు చివరకు రాష్ట్రాన్ని కూడా వదిలేసారు. చాలాకాలం ఉత్తరప్రదేశ్‌లో అమర్ సింగ్ ప్రాపకంతో సమాజ్ వాదీ పార్టీలో చక్రం తిప్పారు. అయితే అక్కడ అమర్ సింగ్ ప్రాభవం తగ్గడంతో జయప్రదకు కష్టాలు తప్పలేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ రాజకీయ జీవితాన్ని పునఃప్రారంభించాలనుకుంటున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. 
 
వైకాపా తీర్థం పుచ్చుకుని రాజమండ్రి లోక్ సభలో పోటీ చేయటానికి కానీ లేదా రాజ్యసభకు వెళ్ళటానికి కానీ మొగ్గుచూపుతున్నారట. చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఫైర్ బ్రాండ్ అయిన రోజాకు రాజకీయ అనుభవం వున్న జయప్రద తోడైతే తప్పకుండా పార్టీకి క్రేజ్ వస్తుందని వైకాపా సీనియర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు