భారత వాతావరణ శాఖ ప్రకారం.. ఢిల్లీలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో సగటున 125.1 మిల్లీ మీటర్ల వాన కురుస్తుందని అంచనా. ఇందులో 95శాతం వర్షాపాతం బుధవారం ఒకే రోజు రికార్డయ్యింది. వాతావరణ మార్పుల కారణంగా రుతువనాల నమూనా మారుతోందని స్కైమెట్ వెదర్ వైస్ ప్రెసిడెంట్ మహేశ్ పలావత్ పేర్కొన్నారు. గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాల్లో వర్షం కురిసే రోజులు తగ్గిందని, తీవ్రమైన వాతావరణ సంఘటనలు పెరిగాయన్నారు.