రాజ్‌నాథ్‌ పాకిస్థాన్‌లో పర్యటిస్తే చంపేస్తాం : హిజ్‌బుల్ హెచ్చరిక

సోమవారం, 1 ఆగస్టు 2016 (10:14 IST)
భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు హిజ్‌బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థ బహిరంగ హెచ్చరిక చేశారు. పాకిస్థాన్‌లో అడుగుపెడితే ఆయనను హత్య చేస్తామని ప్రకటించింది. 
 
పాక్ వేదికగా సార్క్ సదస్సు జరుగనుంది. ఇందులో పాల్గొనేందుకు రాజ్‌నాథ్‌ హాజరుకానున్నారు. రాజ్‌నాథ్ సింగ్‌ను పాక్ రానీయమంటూ హిజ్‌బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సైయద్ సలాహుద్దీన్ హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఒక ప్రకటన చేసింది. పాకిస్థాన్‌‌కు జరపనున్న పర్యటనలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి. 
 
కాగా, సలావుద్దీన్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. కశ్మీర్‌లో ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్‌కౌంటర్‌ అనంతరం అక్కడ చెలరేగిన హింసాకాడపై పాకిస్థాన్ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, దీంతో భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాజ్‌నాథ్ సార్క్ సదస్సు కోసం పాక్ వెళ్లనున్నారు. 

వెబ్దునియా పై చదవండి