పంజాబ్ పర్యటనలో ప్రధాని మోదీకి భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం శాఖ, సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు తెలిపారు. పంజాబ్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భద్రతా వైఫల్యం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ఇప్పటికే ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ చాలా సీరియస్ అయ్యింది. ఈ నిర్లక్ష్యంపై తగిన వివరణ ఇవ్వాలని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాని పర్యటన సందర్భంగా భద్రతా నిర్లక్ష్యం చేయడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, జవాబుదారీతనం పరిష్కరించబడుతుందని హోంమంత్రి అమిత్ షా అన్నారు.