ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ భారత్‌పై కన్నేసింది. దేశంలో విద్యార్థి సంఘాల ఉద్యమాలు పెరిగిపోతున్న తరుణంలో అదే అదనుగా తీసుకుని విద్యార్థి ఉద్యమాల మాటున విధ్వంసం సృష్టించాలని ఐఎస్ పక్కా ప్లాన్ చేస్తోంది. ఇదే విషయాన్ని ఐఎస్ భారత్ విభాగం జునుద్ అల్ ఖలీఫా ఏ హింద్ (జేకేహెచ్)లో పనిచేస్తున్న అధికారులు వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. విద్యార్థులను రెచ్చగొట్టి, దేశంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలని ఐఎస్ కుట్రపన్నినట్లు తెలిసింది.
జేకేహెచ్‌కు చెందిన అషిక్ అహ్మద్ వురపు రజా, మహ్మద్ అబ్దుల్ అహద్, మహ్మద్ అఫ్జల్‌లను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రశ్నించి.. వివరాలు రాబట్టడంతో అసలు విషయాలు బయటికొచ్చాయని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 164 ప్రకారం నమోదు చేసిన వీరి స్టేట్‌మెంట్ల వివరాలను ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. ఐఎస్ఐఎస్‌కు చెందిన ముగ్గురి స్టేట్‌మెంట్లను దర్యాప్తు సంస్థలు రికార్డు చేశాయని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి.