తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రముఖులు సూపర్ స్టార్ రజనీకాంత్, సినీ లెజెండ్ కమల్ హాసన్‌ల హవా కొనసాగనుంది. ఇప్పటికే కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యంను స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు ప్రకటించారు. అయితే పార్టీని స్థాపించినా సీఎం అభ్యర్థిగా ఉండనని రజనీకాంత్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. రజనీకాంత్ కోరితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను సిద్ధమని కమల్‌హాసన్ అన్నారు.