సాధారణంగా విష సర్పాలంటే భయపడి ఆమడదూరం పారిపోతాం. కానీ, ఓ మహిళ ఓ విష సర్పంతో ఆస్పత్రికి వచ్చింది. ఇంతకీ ఆ పాపు చేసిన తప్పేంటంటే.. ఆ మహిళను కాటేయడమే. తనను కాటేసిన పామును చేతపట్టుకుని ఆ మహిళ ఆస్పత్రికి వచ్చింది. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్ణాటకలోని డెంకణీ కోట గ్రామానికి చెందిన మణి అనే మహిళకు సంచన శ్రీ అనే కుమార్తె వుంది. సంచన శ్రీ ఇంటి ముందు ఆడుకుంటుండగా కట్లపాము జాతికి చెందిన ఓ చిన్న పాము కాటేసింది.