ఎఫ్‌బీ పరిచయం... అవకాశం కల్పిస్తానని అత్యాచారం.. ఎక్కడ?

శుక్రవారం, 18 జూన్ 2021 (13:26 IST)
ఇటీవలికాలంలో అనేక మంది అమ్మాయిలు సోషల్ మీడియా వేదికగా మోసపోతున్నారు. ఫేస్‌బుక్ పరిచయాలు అనేక మంది అమ్మాయిల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. తాజాగా కర్నాటకకు చెందిన ఓ యువతిని ఓ యువకుడు అవకాశం కల్పిస్తానని అత్యాచారం చేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటక రాష్ట్రంలోని బన్నేరుఘట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హెబ్బాళ సమీపంలో నివాసం ఉంటున్న యువతి మోడలింగ్‌ రంగంపై ఆసక్తి పెంచుకుంది. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో బిల్వర్థహళ్లి జీపీ సభ్యుడు అహ్మద్‌పాషా ఆ యువతితో పరిచయం పెంచుకున్నాడు.
 
మోడలింగ్‌ రంగంలో ఆమెకు ఆసక్తి ఉన్నట్లు తెలుసుకున్నాడు. తనకు తెలిసినవాళ్లు ఉన్నారని, అవకాశం కల్పిస్తానని నమ్మించాడు. దీంతో ఆ యువతి శ్యానబోగనహళ్లిలోని అహ్మద్‌ నివాసానికి వెళ్లగా మాటలు కలిపి అత్యాచారానికి యత్నించగా ప్రతిఘటించింది. 
 
అయితే నిందితుడు తుపాకీతో బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. యువతిని నగ్నంగా ఫొటోలు తీశాడు. ఎవరికైనా చెబితే ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు బన్నేరుఘట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి అహ్మద్‌ పాషా కోసం గాలింపు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు