అప్పును తిరిగి చెల్లించలేని మహిళపై దారుణం జరిగింది. రుణాన్ని తిరిగివ్వలేని మహిళను కరెంట్ స్తంభానికి కట్టివేసి దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ అమానుష చర్యపై సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, సామ్‌రాజ్ నగర్ జిల్లా, కొడిహెల్లికి చెందిన రాజామణికి 36 ఏళ్లు.
ఈమె ఆ గ్రామంలో చిన్న హోటల్ నిర్వహిస్తోంది. అంతేగాకుండా చిట్ ఫండ్ బిజినెస్ కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో రూ.50వేల వరకు రాజామణి అప్పు తీసుకుంది. ఇంకా తీసుకున్న రుణాన్ని తిరిగి ఇవ్వలేకపోయింది. అయితే రాజామణికి రుణంగా డబ్బులిచ్చిన వారు ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఆమెను కరెంట్ స్తంభానికి కట్టివేసి చిత్ర హింసలకు గురిచేశారు.
వీడియోలో ఆమెను చెప్పులతో, చీపురుతో దాన్ని కొట్టండి అంటూ తీవ్రంగా దూషించడం, హింసించడం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై రచ్చ మొదలు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.