అయితే, జాదవ్‌కు పాక్ కోర్టు ఉరిశిక్ష విధించిందన్న వార్త మీడియాలో ప్రసారం కాగానే జాదవ్ భార్య, ఆయన తల్లి, కుమారుడు శుభాంకర్, కుమార్తె భార్వి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా పాకిస్థాన్ కోర్టు అంత పెద్ద నిర్ణయం తీసుకోవడంతో వారంతా కుంగిపోయినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత వారంతా పూణెలోని ఇంటిని ఖాళీ చేసి కనిపించకుండా పోయారు. వీరు ఎక్కడికి వెళ్లారనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ముంబై పోలీస్ కమిషనర్‌గా పనిచేసి రిటైర్ అయిన కుల్‌భూషణ్ తండ్రి సుధీర్ జాదవ్ ప్రస్తుతం మహారాష్ట్ర నైరుతి ప్రాంతానికి చెందిన షాంగ్లీలో నివాసం ఉంటున్నారు. వీరంతా అక్కడికే వెళ్ళివుంటారని భావిస్తున్నారు.